Friday, January 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీ వాణి విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

శ్రీ వాణి విద్యానికేతన్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

విశాలాంధ్ర,, ఉరవకొండ (అంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని శ్రీ వాణి విద్యానికేతన్ పాఠశాలలో శుక్రవారం ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రఘు రాములు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పాఠశాలలో పిల్లలందరూ సాంప్రదాయ వస్త్రాలను ధరించి రంగవల్లులు వేశారు. భోగి మంటలు వేసి, గాలిపటాలు ఎగురవేశారు. పిల్లలందరూ పాఠశాల ఆవరణలో పండగ వాతావరణాన్ని కనపరిచారు. రంగవల్లులు, గాలిపటాల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి
విద్యార్థుల, వారి తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు