Homeజిల్లాలుఅనంతపురంగవి మఠం బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు..

గవి మఠం బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు..

- Advertisement -

21 నుంచి 28 వరకు వైభవంగా ఉత్సవాలు

విశాలాంధ్ర, ఉరవకొండ: ఉరవకొండ గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యంగా 26వ తేదీన మహా రథోత్సవం, 27వ తేదీన లంక దహనం కార్యక్రమాలు వైభవంగా జరుగనున్నాయని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక సదుపాయాలు సమగ్రంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా పరంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను కాపాడాలని పోలీసు శాఖకు సూచించారు. భక్తులు కూడా పోలీసు శాఖ, పరిపాలనకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే బ్రహ్మోత్సవాలు శాంతియుతంగా, ఘనంగా జరుగుతాయని ఆర్డీవో అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో దేవస్థానం సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున, డిప్యూటీ తహసీల్దార్ భోగన్న గౌడ్, ఎస్సై జనార్దన్ నాయుడు, ఎంపీడీవో రవి ప్రసాద్, ఆర్ డబ్యు ఎస్ , గ్రామపంచాయతీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ తదితర ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు