Wednesday, February 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ఆగడాలను అరికట్టండి

ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ఆగడాలను అరికట్టండి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బజాజ్, శ్రీరామ్ చిట్, టీవీఎస్ ప్రైవేట్ ఫైనాన్స్ లాంటి కంపెనీల ఆగడాలను అరికట్టాలని కోరుతూ డి.ఎస్.పి హేమంత్ కుమార్ కు వినతి పత్రాన్ని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూధర్మవరం పట్టణంలో పలు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ఏజెంట్లు కస్టమర్లతో ఇష్టానుసారంగా అవలంబిస్తున్నారు అని,ఒక కంతు పెండింగ్ ఉన్న దాడులు చేయడం, దుర్భాషలాడడం ఇంటి దగ్గరికి వెళ్లి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతున్నది అని తెలిపారు.వారి ఏజెంట్లు ఓ గ్రూప్ ముఠాగా తయారై అమాయకమైన ప్రజల ఇంటి దగ్గరికి వెళ్లి వారి ఆర్థిక ఇబ్బందులు ఆసరాగా చేసుకుని, వారే లోన్ కల్పించి, వడ్డీ మీద వడ్డీ వేసి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని తెలిపారు.ఒకటి రెండు కంతులు పెండింగ్ ఉండడంతో ఈ ముఠా సభ్యులంతా కలిసి వారిపై దాడి చేయడం, వారి ఇంట్లో వస్తువులను తీసుకురావడం, ఆడవారిని అసభ్యంగా ప్రవర్తించడం పట్టణంలో చాలా జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే చేనేత పరిశ్రమ పరిస్థితి తీవ్ర సంక్షేమంలో కూరుకుపోవడంతో చేనేత కార్మికులునే టార్గెట్ చేసుకొని ప్రైవేట్ ఫైనాన్స్ వారు ఇష్టానుసారంగా అవలంబిస్తున్నారు అని మండిపడ్డారు. వీరు చేస్తున్న దోపిడీకి చాలామంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడుతోందని బాధని వ్యక్తం చేశారు.
చాలా మంది ఏజెంట్లు వారి కస్టమర్ తో కంతు అమౌంట్ కట్టించుకొని ఫైనాన్స్ కంపెనీకి కట్టకుండా, కట్టినట్టుగా వారి కస్టమర్ కి కట్టాము అని రసీదు కూడా ఇవ్వకుండా మభ్యపెట్టి, కంపెనీ నుండి కాల్స్ రాకుండా చేసి కస్టమర్స్ ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని తెలిపారు. ఇన్ని జరుగుతున్న కూడా ఏజెంట్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని మండిపడ్డారు.ఇప్పటికైనా సరే వారు ఉన్నటువంటి నామ్స్ ను లీగల్ ద్వారా పరిశీలించి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి రమణ, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా అధ్యక్షులు పొలాల లక్ష్మీనారాయణ, జిల్లా గౌరవాధ్యక్షులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు