Sunday, November 16, 2025
Homeజాతీయంకాశీబుగ్గ తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి… రూ.2 లక్షల పరిహారం

కాశీబుగ్గ తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి… రూ.2 లక్షల పరిహారం

- Advertisement -

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట

9 మంది భక్తుల మృతి
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం
గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధాని, బాధితులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ, ఁఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను, కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానుఁ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.అదేవిధంగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆలయంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు