జిల్లా ఎస్పీ పి.జగదీష్
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : పి జి ఆర్ ఎస్ పిటీషన్లకు జాప్యం లేకుండా చట్టబద్దమైన పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రజల నుంచి స్వయంగా 106 వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… బాధితుల నుంచి వచ్చిన ప్రతి పిటిషన్‌నూ బాధ్యతాయుతంగా విచారించాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులను వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి, నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తి చేయాలన్నారు.
ఫిర్యాదుపై విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత పిటిషనర్‌కు తప్పనిసరిగా సమాచారం అందించాలన్నారు. సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపించేలా అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు.
పి జి ఆర్ ఎస్ పిటీషన్లకు చట్టబద్దమైన పరిష్కారం చూపండి
- Advertisement -
RELATED ARTICLES


