సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం:: ఆర్ డి టి సంస్థ మనుగడపై రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశమును నిర్వహిస్తున్నట్లు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సిపిఐ పట అనంతరం వారు మాట్లాడుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వెనుక భాగాన గల ఎన్జీవో హోమ్ లో మే రెండవ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, మేధావులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు ,సోషల్ వాలంటరీ సంస్థలు, విద్యార్థి నాయకులు అందరూ పాల్గొని విలువైన సందేశాన్నిస్తూ ఆర్డిటి సంస్థ కోసం రాష్టం లో ని పలు జిల్లాల లో రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) చేస్తున్న ప్రజా కార్యక్రమాలు అందరికీ తెలియ చెప్పాలన్నదే మన కర్తవ్యం అని తెలిపారు.అలాంటి సేవా దృక్పథం తో పని చేస్తున్న ఆర్డీటి సంస్థ కు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్టు కింద విదేశాల నుండి వస్తున్న నిధుల కు గాను ఎఫ్ సి ఆర్ ఏ.. ని రెన్యూవల్ చేయనందు వల్ల సంస్థ ఆర్ధిక కష్టాలతో వారు నిర్వహించే విద్య, వైద్యం, మంచినీటి తదితర పథకాలను నిర్వహించ లేకపోతున్నది అని ఆవేదన వ్యక్తం చేశారు.కావున రాజకీయ పార్టీ లు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ లు, కుల సంఘాలు, అందరు ముక్త కంఠం తో ఆర్డీటి కి కేంద్రం మినహాయింపును ఇవ్వాలని అభ్యరహించవలసిన ఎంతైనా ఉన్నదని వారు స్పష్టం చేశారు.కావున ఆర్డీటి ని కాపాడుకొనుటకు ప్రతి ఒక్కరు హాజరై తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వవలసినదిగా రాము కోరుతున్నాము అని తెలిపారు.
ఆర్. డి. టి. సంస్థ మనుగడ పై రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశం..
RELATED ARTICLES