Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపోస్ట్ ఆఫీస్ ముందు ఉన్న వ్యర్థదార్థాలను తొలగించండి..

పోస్ట్ ఆఫీస్ ముందు ఉన్న వ్యర్థదార్థాలను తొలగించండి..

- Advertisement -

తపాలా ఉద్యోగుల ఆవేదన
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల ప్రధాన తపాలా కార్యాలయం ముందు బాగాన విపరీతమైన చెత్తాచెదారం వేస్తున్నారని వాటిని మున్సిపల్ అధికారులు వెంటనే తొలగించాలని తపాలా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తపాలా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించలేకపోతున్నారని, ఆ వాసన భరించలేకపోతున్నారని వారు బాధను వ్యక్తం చేశారు. అంతేకాకుండా చెత్త ఎత్తిన తర్వాత గాలికి ఎగిరి కార్యాలయంలోనికి వస్తున్నదని, దీంతో దుర్వాసన మరింత ఎక్కువ అవుతుందని తెలిపారు. కావున ఆ చెత్తను అక్కడినుండి వేయకుండా వేరే చోటుకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ కి వచ్చి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, మానవతా దృక్పథంతో మునిసిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. ఈ చెత్తా చెదారం సమస్య రోజురోజుకు అధికమవుతుందని, ప్రజలతోపాటు తపాలా ఉద్యోగులు కూడా అనారోగ్యానికి గురవుతున్నారని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ముందు చెత్త వేయకుండా తగిన చర్యలు చేపట్టి ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు