పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని వసంతపురం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం నిర్వహణలో విశేష స్పందన రావడం జరిగిందని పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్, పశువైద్యాధికారి డాక్టర్ శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ శిబిరంలో దూడలు, పెద్ద పశువులలో నట్టాల నివారణ, గొర్రెలలో, మేకలలో డి వార్మింగ్, పశువులలో గర్భకోశ వ్యాధులు, తదితరులు వాటికి చికిత్సను నిర్వహించి వాటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా స్థిరపడం జరిగిందని తెలిపారు. పశువుల పట్ల ఆరోగ్య విషయంలో పెంపకం దారులు నిర్లక్ష్యం విడనాడి ఎప్పటికప్పుడు స్థానిక పశువుల ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందిస్తే చక్కటి ఆరోగ్యాన్ని పశువులు పొందుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ చౌదరి, పురుషోత్తమ నాయుడు, ప్రసాద్, చక్రయ్య ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఉచిత పశు ఆరోగ్య శిబిరమునకు స్పందన..
RELATED ARTICLES