రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దుచేసి, భూములను తిరిగి ఇప్పిస్తామని హామీఇచ్చి, వాటిని ఇతర అవసరాలకు రేవంత్ మళ్లించడం అత్యంత నీచమైన చర్య అని విమర్శించారు. దోస్తులకు దోచిపెట్టేందుకు చీకటి ఒప్పందాలతో తెరపైకి తెచ్చిన ఫ్యూచర్ సిటీకి అక్రమంగా భూములు కేటాయిస్తే స్థానిక రైతులే కాదు.. బీఆర్ఎస్ కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
అల్లుడి ఫార్మా కంపెనీ కోసం కొడంగల్ లో దళిత, గిరిజనుల భూములను కొల్లగొట్టే కుట్రలను మొదలుకుని, అనుముల బ్రదర్స్ కోసం ఫ్యూచర్ సిటీ పేరిట అన్నదాతల భూములను చెరబట్టే పన్నాగాల దాకా.. రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని ఫార్మా సిటీ భూముల వ్యవహారంలో మరోసారి తేలిపోయింది. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దుచేసి, భూములను తిరిగి ఇప్పిస్తామని హామీఇచ్చి, వాటిని ఇతర అవసరాలకు రేవంత్ మళ్లించడం అత్యంత నీచమైన చర్య అన్నారు. ఫార్మా సిటీ భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తే, రైతులు తిరిగి భూములు పొందే హక్కును కూడా కాంగ్రెస్ కాలరాయడం క్షమించరాని నేరం. దోస్తులకు దోచిపెట్టేందుకు చీకటి ఒప్పందాలతో తెరపైకి తెచ్చిన ఫ్యూచర్ సిటీకి అక్రమంగా భూములు కేటాయిస్తే స్థానిక రైతులే కాదు.. బీఆర్ఎస్ కూడా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు్ణ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


