Wednesday, January 22, 2025
Homeజాతీయంఆసుప‌త్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్‌

ఆసుప‌త్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్‌

క‌త్తిపోట్ల‌కు గురైన బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ ముంబ‌యి లీలావ‌తి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కాసేప‌టి క్రితం ఆయ‌న ఆసుప‌త్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కాగా, ఈ నెల 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండ‌గుడు క‌త్తితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. సైఫ్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన ఆగంతుకుడు ఆయ‌న‌పై దాడి చేసి, తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. దీంతో ఐదు రోజుల పాటు లీలావ‌తి ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందారు. సైఫ్ కోలుకోవ‌డంతో ఈరోజు ఆయ‌న‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇక సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్ప‌డిన నిందితుడిని ముంబ‌యి పోలీసులు ఆదివారం నాడు థానేలో అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో అత‌డు బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మహ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్‌గా పోలీసులు గుర్తించారు. అయితే, అత‌డు త‌న‌ పేరు మార్చుకుని, అక్ర‌మంగా ఇండియాలో ఉంటున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నాడు అధికారులు సైఫ్ నివాసాన్ని సందర్శించి క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు