Homeజిల్లాలుఅనంతపురంగుంతకల్లులో తీవ్ర తాగునీటి సంక్షోభం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

గుంతకల్లులో తీవ్ర తాగునీటి సంక్షోభం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

- Advertisement -

విశాలాంధ్ర–గుంతకల్లు: గుంతకల్లు పట్టణ ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో ఎనిమిది రోజులకు ఒకసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ నైరుతి రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ రామాంజనేయులు ఆధ్వర్యంలో శనివారం కొట్టాల రోడ్డులోని సమ్మర్ స్టోరేజ్ (ఎస్‌ఎస్) ట్యాంకును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా సంబంధిత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ పరిశీలన కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు