విశాలాంధ్ర -బొమ్మనహళ్ : బొమ్మనహళ్ తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మండలస్థాయిలో కేవలం నలుగురు అధికారులు మాత్రమే హాజ రయ్యారు. ఇందులో తహసిల్దార్ మునివేలు, ఎంఈఓ మల్లికార్జున, హెచ్ ఎల్ సి జేఈ అల్తాఫ్, విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ అనీఫ్ , మాత్రమే ఉన్నారు.ఉదయం 11 గంటల్లోపు ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో,హౌసింగ్ ఏఈ, వ్యవసాయ అధికారి, బుక్కులో సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. సరిగ్గా11 గంటలకు విద్యుత్ శాఖ అధికారి లక్ష్మారెడ్డి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోయారు.మిగతా శాఖఅధికారులు గై హజరు అయ్యారు. గత రెండు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధికారులంతా హాజరయ్యారు. అప్పుడుఉన్నత అధికారుల ఆదేశాల మేరకు హాజరు అయ్యారేమోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.


