విశాలాంధ్ర బొమ్మనహల్.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే యూరి యా కొరత ఏర్పడిందని సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున, రైతు సంఘం తాలూకా కార్యదర్శి తిప్పేస్వామి, అన్నారు. సోమవారం బొమ్మనహళ్ తహసిల్దార్ కార్యాలయం వద్ద రైతులకు సకాలంలో ఎరువులు అందించి ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసిల్దార్ మునివేలుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఎరువుల కోసం యూరియా కోసం రైతులు ప్రతిరోజు ఆయా గ్రామాల్లోని రైతు సేవ కేంద్రం చుట్టూ అదేవిధంగా ఎరువుల దుకాణాలు చుట్టూ రైతులు ప్రదర్శనలు చేస్తూ అష్ట కష్టాలు పడుతున్నారు అయినా వారికి సమస్య పరిష్కారం కావడం లేదు ఈ బాధ్యత ప్రభుత్వానిదే రైతన్నలకు తగిన నిలువలు సిద్ధం చేయాలి బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా విజిలెన్స్ ను నియమించాలి ఎరువులు నిలువగా ఉంచాలి . అదే విధంగా సరపరాల్లో తేడా రాకూడదు ఇలా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయబట్టాలి . మార్క్ఫైడ్ ద్వారానే సరఫరా జరగాలి వ్యవసాయ అధికారులు నిఘా ఉంచాలి ప్రతి జిల్లాలో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు యూరియా పరిస్థితి నెలకొంది యూరియా కోసం పడి కాపులు కాస్తున్న అన్నదాతలు ను ఆదుకోవాలి.అనంతపురం జిల్లా నుంచి నియోజకవర్గాలకు పంపే యూరియా లోడ్లు మండల వాసులకు ఏమాత్రం సరిపోదుతీవ్ర అన్యాయం జరుగుతోంది రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న రైతు సేవా కేంద్రంవద్ద పడి కాపులు కాయల్సివస్తుంది యూరియా వచ్చిన కొన్ని గంటల్లోనే అమ్ముడుపోతా ఉంది మరి ఎప్పుడు యూరియా వస్తుందని రైతులు పడి కాపులు కాస్తున్నారు ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తుండడం పురుగుల మందులు కొంటేనే యూరియా విక్రయిస్తామని నిబంధన విధిస్తుండడంతో సొసైటీ వద్ద ఎరువులు కొనుగోలుకు రైతులు మగ్గుచూపుతున్నారు అక్కడ అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేక లేని పరిస్థితిలో ప్రైవేట్ వ్యాపారం చేసేవారిని ఆశ్రయిస్తున్నారు అధికారులు మాత్రం ఎరువుల కొరత లేదని చెబుతూ వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇప్పటికైనా రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఎరువులు. యూరియా గాని సంబంధిత మందులు గాని అన్నివేళలా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి . ఎవరైతే అక్రమ దారుల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తారో వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి . అదేవిధంగా రైతులకు అన్యాయం చేస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకుంటూ వారి లైసెన్సులు రద్దు చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి దీనిపై చర్యలు తీసుకోవాలి . ఎందుకంటే మంచి వర్షాలు వస్తున్నాయి రైతులు కూడా పంటలు పెట్టుకునేందుకు సంసిద్ధమవుతున్నారు . కావున ప్రతి రైతు తమ వ్యవసాయాలని సంతోషంగా పని చేసుకునే విధంగా సంబంధిత అధికారులు ప్రభుత్వము సహాయ సహకారాలు అందించాలి కోరుచున్నాము ఈ సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుచున్నాము .ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహులు, తేజ, రామాంజనేయులు, కృష్ణయ్య, నరసింహులు, మంజునాథ, మల్లయ్య, కృష్ణయ్య, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
యూరియా కొరత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే…
- Advertisement -


