విశాలాంధ్ర -పీసీపల్లి : పీసీపల్లి మండలంలో అక్రమ విద్యుత్ వాడకంపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విద్యుత్ వినియోగదారుల గృహాలు వాణిజ్య సముదాయాలపై పలు రకాల కేసులు నమోదు చేసి రూ 267000 అపరాధ రుసుము విధించినట్లు విద్యుత్ శాఖ కనిగిరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ ఉమాకాంత్ తెలియజేశారు. మండలంలో 12 మంది అధికారులు 80 మంది సిబ్బంది 25 బృందాలుగా ఏర్పడి సర్వీసులను తనిఖీ చేసినట్లు సమావేశంలో అధికారులు వివరాలు వెల్లడించారు. అదనపు లోడు వినియోగిస్తున్న మీటర్ ఉండి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 08 సర్వీసులకు రూ 242000 అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న 9 సర్వీసులకు రూ 25000 అపరాధ రుసుము విధించామని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగితే 9440812358బీ 9440812359 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. లేదా నేరుగా వాట్స్అప్ ద్వారా తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిపిఈ టి హైమావతి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే వెంకటేశ్వర్లు పామూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి కృష్ణారెడ్డి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే కోటేశ్వరరావు కే కోటయ్య ఆపరేషన్ అసిస్టెంట్ కి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
విద్యుత్ శాఖ అధికారుల ఆకస్మిక దాడులు
- Advertisement -
RELATED ARTICLES


