Saturday, March 7, 2026
Homeజిల్లాలుకర్నూలువైభవంగా శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రథోత్సవం

వైభవంగా శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రథోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామంలో వెలిసిన శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రధోత్సవం సోమవారం అశేష భక్తవాహిణి నడుమ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు జంగం వీరభద్ర స్వామి స్వామివారికి జలాభిషేకం, కుంకుమార్చన, పుష్పభిషేకం, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రథాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. సాయంత్రం గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ కీ.శే. గజ్జల వెంకట్రామిరెడ్డి ఇంటి నుంచి కుంభం, కలసంతో ఊరేగింపుగా స్వామివారి రథం వద్ద తెచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయం నుంచి అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తెచ్చి రథంపై ప్రతిష్టించి స్వామివారి రథోత్సవం అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా సాగింది. రథోత్సవం సందర్భంగా చిన్నారులు, యువకులు కోలాటాలతో విశేషంగా ఆకట్టుకున్నారు. శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రధోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ మల్లేష్, మాజీ సర్పంచ్ జి. శివరామరెడ్డి, వ్యవసాయ సలహా మండలి మాజీ సభ్యులు గజ్జల గజేంద్రరెడ్డి, నాయకులు మహాబళేశ్వర్, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు