Friday, March 6, 2026
Homeజిల్లాలుతూర్పు గోదావరిఅగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బాధ్యతా సేవా సంస్థ సాయం

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బాధ్యతా సేవా సంస్థ సాయం

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, జేగురుపాడు గ్రామం, బీసీ కాలనీ లో నివాసం ఉంటున్న ర్యాలి సత్యవతి కుటుంబానికి చెందిన తాటాకిల్లు ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించి ఇంట్లో ఉన్న సామాగ్రి ఎలక్ట్రికల్ వస్తువులు కాలి బూడిద అయ్యాయి. గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, గ్రామ పార్టీ నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, వారితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంటసామగ్రి, నగదు అందజేశారు. సర్పంచ్ స్టాలిన్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబం అయిన సత్యవతి ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలి బూడిదవటం దురదృష్టకరమని, బాధితులను పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆదుకోవాలని అన్నారు. బాధితురాలికి ప్రభుత్వం తక్షణమే పక్కా ఇల్లు నిర్మించి ఆదుకోవాలని కోరారు. రూరల్ నియోజకవర్గంలో 2001 నుంచి సుమారు 25 సంవత్సరాలుగా కష్టాల్లో ఉన్న బాధితులకు తమ వంతుగా బాధ్యతా సంస్థ ఆదుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఆకుల సుధాకర్, పార్టీ నాయకులు బళ్ళ అన్నవరం, యమ్ మునియ్య, శాఖా కిరణ్, తోట వెంకన్న, మెట్ట బాలాజీ, అంగర రాజు, బుడ్డిగ అచ్చయ్య, ఎమ్ వంశీ, వేగుళ్ళ నాని, ఎన్ ఏడుకొండలు, పక్కి వాసు, సర్కార్ బాషా, పున్నమి రాజు వీర్రాజు, కొత్తపల్లి బాలాజీ, బత్తిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు