ఎంఈఓలు.. రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; తల్లికి వందనం పథకం పడని విద్యార్థులు నేరుగా ఎంఈఓ కార్యాలయంలో సంప్రదించాలని ఎంఈఓలు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం రూరల్ , అర్బన్ మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో 121 సి కింద గత ఐదు సంవత్సరాల నుండి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, తల్లికి వందనం పడనియెడల అనగా ప్రవేట్ పాఠశాలలో ఉచితంగా సీటు పొంది ఆ పాఠశాలకు ఇవ్వకుండా వేరే పాఠశాలలో చదివే విద్యార్థులు, అదేవిధంగా అదే పాఠశాలలో ఉచిత సీటు పొందినటువంటి విద్యార్థులు తల్లికి వందనం పడకపోతే వెంటనే మండల విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. విచారణ చేపట్టిన తర్వాత పథకమును వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
తల్లికి వందనం పథకం పడని విద్యార్థులు ఎంఈఓ కార్యాలయంలో కలవండి
- Advertisement -
RELATED ARTICLES


