Homeక్రీడలుసూర్యవంశీని స్థిరపడనివ్వాలి

సూర్యవంశీని స్థిరపడనివ్వాలి

- Advertisement -

20 ఏళ్లు దాటాక అసలైన పరీక్ష
యువ సంచలనంపై కపిల్ దేవ్ వ్యాఖ్య
క్రీడలు:
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యల చేశారు. ఆయన కొన్నేళ్లపాటు ఆటలో స్థిరపడాలన్నారు. అసలైన పరీక్ష కొన్నాళ్ల తర్వాత ప్రారంభమవుతుందని చెప్పారు. వైభవ్ ప్రస్తుతం చాలా చిన్నవాడని, ఆటలో ఇంకా నిలదొక్కుకోవాలన్నారు. ఇప్ప్పుడే సచిన్‌తో వైభవ్‌ను పోల్చడం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరూ దాదాపు ఒకే వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టడం గమనార్హం. ఐర్లాండ్‌తో శుక్రవారం నుంచి టీ20 సిరీస్‌లో భారత్ ఆడనుంది. ‘వైభవ్ సూర్యవంశీ చాలా చిన్నవాడు. అతడి వయసు 15ఏళ్లే. అతడికి అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఇప్ప్పుడు అతడికి అంతా క్రికెట్టే. అయితే, వైభవ్ 20 లేదా 22 ఏళ్ల వయసుకు వచ్చినప్ప్పుడు ఆయనకు ఆటలో స్థిరత్వం వస్తుంది. ఆ తర్వాత ఓ అభిప్రాయానికి వద్దాం. అతడి టాలెంట్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుత ఆటగాడు. సచిన్‌లానే 16 ఏళ్లకే అడుగు పెడుతున్నాడు. కానీ, సుదీర్ఘ కాలం ఆడతాడా? లేదా? అనేది ఇప్ప్పుడే చెప్పలేం’ అని కపిల్ వెల్లడించారు.
ఆటతీరు బాగుంది: గావస్కర్
వైభవ్ సూర్యవంశీపై మరో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఆటతీరు బాగుందని మెచ్చుకున్నారు. ‘భారత్‌కు అతడొక వరం. బంతిని బాదే విధానం చాలా బాగుంది. ఒత్తిడిని దరిచేరనీయడు. ఐపీఎల్‌లో అతడు ఎలాంటి ఇన్నింగ్స్‌లు ఆడాడో మనం చూశాం’ అని గావస్కర్ వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు