విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : వజ్రకరూరు మండలం చిన్న హోతురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే రగ్బీ పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడాకారులను అభినందించారు. బుధవారం స్థానిక పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ అనంతపురం ఆర్డిటి క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించిన సెలక్షన్లలో రగ్బీ క్రీడకు సంబంధించి విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి ఐదు మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్ష నియమన్నారు.అండర్ 14రగ్బీపోటీలో సి. అనిత,బి. శ్రీ సూర్య ఎంపిక కాగా అండర్ 19 రగ్బీ లో సి.వైష్ణవి, మల్లి, మురారి లు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఎంపికైన క్రీడాకారులు కర్నూలు మరియు అనంతపూర్ లో జరిగే స్టేట్ మీట్ లో పాల్గొంటారని తెలిపారు.


