విశాలాంధ్ర- ధర్మవరం ; ఓజోన్ పొరను సంరక్షించుకొనుట అందరి బాధ్యత అని ప్రిన్సిపాల్ పద్మశ్రీ, ఫిజికల్ సైన్స్ టీచర్ విజయ్ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో వరల్డ్ ఓజోడే ను ఘనంగా జరుపుకున్నారు. సైన్స్ టీచర్లు విద్యార్థులతో ఓజోన్ పొర పరిరక్షణకు సంబంధించిన అవగాహన కల్పించుటకు గొడుగులతో ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా పోస్టర్ ప్రదర్శన భక్తుత్వపు పోటీలు నిర్వహించారు. తదుపరి ఓజోన్ (03) ఆకారంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఓజోన్ పొర అనేది భూమిని పరిరక్షితలో ఒక పొర అని తెలిపారు. వాతావరణం కాలుష్యం వలన, వివిధ వాహనాల ద్వారా వచ్చే పొగ వలన, చెట్లను నరకడం వలన, ఫ్రిడ్జ్లు, ఏసీలు నుంచి వచ్చే క్లోరో కార్బన్ అనే వాయు ద్వారా ఓజోన్ పొర దెబ్బతింటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైన్స్ టీచర్లు శ్రావణ కుమారి, మనోహర్ కుమార్ రెడ్డి, శ్రావణి పాల్గొన్నారు.
ఓజోన్ పొరను సంరక్షించుకొనుట అందరి బాధ్యత.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ
- Advertisement -
RELATED ARTICLES


