తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ వివరాలు వెల్లడించారు.ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ను మొత్తం రూ.3,24,234 కోట్లుగా ప్రకటించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు, మార్గదర్శకత్వాన్ని అనుసరించుతూ పాలన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.మరోవైపు శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ స్వరూపం
మొత్తం బడ్జెట్: రూ.3,24,234 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.2,34,406 కోట్లు
మూలధన వ్యయం: రూ.47,267 కోట్లు
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, పౌరసరఫరాలు వంటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు
ఐటీఐ, ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 ఉపకార వేతనం అందించనున్నారు
వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు కేటాయించారు
విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు మంజూరు చేశారు
పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు కేటాయించారు
పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు కేటాయింపులు చేశారు


