విశాలాంధ్ర – పెద్దకడబూరు(కర్నూలు) : విద్యార్థులకు శాస్త్రీయమైన విజ్ఞానంతో, పాటు నాణ్యమైన విద్యనందించి ఉత్తమ అభ్యాసకులుగా ఉత్తమ,దేశ పౌరులుగా చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ నిధుల క్రింద 65 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న ల్యాబ్ రోటరీ బిల్డింగ్స్, లైబ్రరీ బిల్డింగ్స్ ఆటస్థల సామాగ్రి బిల్డింగ్స్ కు ఉపాధ్యాయ బృందం తో పాటు, విధ్యాకమిటీచేర్మేన్, గుమ్ముల స్వామిరాజు అధ్యక్షతన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వేలాది మంది విద్యార్థులు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారని తెలిపారు. వారి సంక్షేమానికై శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించి, ఉత్తమ ప్రయోజకులుగా చేయాలనే సత్సంకల్పంతో భారీ మొత్తంలో నిధులు విధ్యాశాఖకు కుటమి ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. విధ్యార్థులు ప్రభుత్వం అదించే అవకాశాలు సద్వినియోగం చేసుకొని బాగా చదువు కొని ప్రయోజకులై, గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీల నాయకులు డి మల్లికార్జున, జిల్లా ఎస్. సి. సెల్ నాయకులు మీసేవ ఆంజనేయులు, బొగ్గుల, నరసన్న, గుమ్ముల ఆశన్న,యం. ఆదాము ఇమ్మానుయేల్, బొగ్గుల తిక్కన్న, జి. బుడ్డన్న, జె. దేవసాయం, సుధాకర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.