సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ డిమాండ్
విశాలాంధ్ర అనంతపురం: తక్షణమే సేకి విద్యుత్ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రద్దు చేయాలని సిపిఐ అనంతపురం జిల్లా సమితి తరపున సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు గతంలో వైసిపి ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సేకీ) ద్వారా ఆదాని సంస్థల నుండి 7 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుందన్నారు. ఆనాటి ప్రభుత్వ పెద్దలకు రూ. 1, 750 కోట్ల ముడుపులిచ్చి ఒప్పందం చేసుకున్నట్లు అమెరికా న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్టిక్ కోర్ట్ లో కేసు నమోదు అయిందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ భారాన్ని తగ్గిస్తామని చెప్పడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు సేకి ఒప్పందం రద్దు కుదరదని గురువారం విద్యుత్ రంగంపై సభలో జరిగిన చర్చల్లో ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం జరిగిందన్నారు. తుదకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఒప్పందం సభ బే అని స్పష్టం చేసిందన్నారు. ఒప్పందాలపై సంతకాలు పెట్టాక వెనక్కు తీసుకుంటే పెనాల్టీలు కట్టడంతోపాటు విశ్వసనీయత పోతుందని అందువలన వాటిని కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది అని శాసనసభ సాక్షిగా చెప్పడంపై ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. గత ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ రూ 2.49 పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తామని సేకీ. ముందుకు రావడంతోనే అప్పట్లో ఈ జరిగిందన్నారు. పేదల ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, రాష్ట్రములో పేదలకు ఇచ్చే ఇళ్లస్థలాల కోసం పదివేల కోట్లు కేటాయించి ఇంటి నిర్మాణానికి మీరు ఇస్తానన్న నాలుగు లక్షలు సరిపోవు సిమెంటు ఇసుక ఇటుక ఇనుము కంకర తదితర సామాగ్రి ధరలు పెరిగినందున ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేయాలని నాయకులు కోరడం జరిగిందన్నారు . అర్హులైన పేదలందరికీ షరతులు లేకుండా ఇంటి స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల రెవెన్యూ జిల్లా కేంద్రాలలో సిపిఐ ఆధ్వర్యంలో అర్జీలు అందజేశామన్నారు. వాటినన్నిటిని పరిశీలించి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలము ఇల్లు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టిడిపి టిడ్కో ఇళ్ల నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి లక్షలాది ఇల్లు నిర్మించారన్నారు. కొంతమంది లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకుండానే బ్యాంకుల ద్వారా ఈఎంఐలు కట్టాలని నోటీసులు వస్తున్నాయి వడ్డీ భారం కూడా అధికంగానే ఉందన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి బ్యాంకు బకాయిలను రద్దు చేసి వారికి న్యాయం చేకూర్చవలసిందిగా కోరారు.