Homeఆంధ్రప్రదేశ్హోరెత్తిన రైతు పోరుబాట

హోరెత్తిన రైతు పోరుబాట

- Advertisement -

విశాలాంధ్ర – కొవ్వూరు : రైతులకు సరిపడా యూరియా, ఎరువులు అందజేయాలి అని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి అని , వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే అందజేయాలి అని కొవ్వూరు గోపాలపురం నిడదవోలు వైసిపి నియోజకవర్గం ఇన్చార్జిలు డిమాండ్ చేశారు.వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసిపి ఇన్చార్జిలు కొవ్వూరు తలారి వెంకట్రావు గోపాలపురం తానేటి వనిత నిడదవోలు జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో మూడు నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలతో మంగళవారం కొవ్వూరు మెరక వీధి నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీవో కార్యాలయ కెఆర్ సి సి తాసిల్దారు అచ్యుత కుమారికి వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి గోపాలపురం వైసిపి ఇన్చార్జ్ తానేటి వనిత మాట్లాడుతూ రైతు కష్టానికి వైసిపి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతులకు యూరియా ఎరువులు దొరకటం లేదని బ్లాక్ మార్కెట్ కి తరలి వెళ్ళిపోతున్నాయని రైతులు యూరియా కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని రైతులు బ్లాక్ మార్కెట్లో యూరియాని కొనలేని పరిస్థితిలో ఉన్నారని కూటమి ప్రభుత్వం రైతులకు చేసింది శూన్యమని గతంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసాలను ఏర్పాటు చేసి రైతు భరోసాలు సొసైటీల ద్వారా యూరియా సరఫరా చేసి కొరత అనేది లేకుండా చేసామని పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించామని కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని రైతుల ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కొవ్వూరు నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ తలారి వెంకట్రావు మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు పరిపాలనలో రైతులకు గిట్టుబాటు ధర సబ్సిడీ లేదని యూరియా అందుబాటులో లేదని బ్లాక్ మార్కెట్లు తరలి వెళ్ళిపోతుందని ఎరువులు అధిక ధరలకు అమ్మకుండా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టాలని అన్నారు. నిడదవోలు వైసిపి ఇన్చార్జి జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ యూరియా కొరత వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని బ్లాక్ మార్కెట్ ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని యూరియా రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మూడు నియోజకవర్గాల నుండి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు