-ఎంపీడీఓ బి.విజయలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు ; మండలంలోని ఎం.బండమీద పల్లి, మరూరు పంచాయతీలను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రథమ కర్తవ్యం అని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి అన్నారు. బుధవారం టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, మరూరు సొసైటీ చైర్మన్ గోనుగుంట్ల గోపాల్ తో కలిసి పల్లె పండుగ 2.0లో భాగంగా రూ.43 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నూతన సీసీ రోడ్లను నిర్మించేందుకు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ రకాల పథకాలను అమలు చేసి ప్రజలకు లబ్ది చేకూర్చామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ బి.అశోక్ బాబు పీఆర్ ఏఈ కిషోర్ బాబు, ఏపీఓ ఎ. సావిత్రి, పంచాయతీ కార్యదర్శులు కుళ్ళాయి నాయుడు, విజయ్ కుమార్, హిందూపురం పార్లమెంటు ఆర్గనైజింగ్ కార్యదర్శి బోయ వెంకటరాముడు, నెట్టెం లక్ష్మీనారాయణ, మరూరు కేశవ, మేనక, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎం.సుధాకర్, కదిరప్ప, నాయకులు ఉమాపతి, వీరనారప్ప, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.


