- Advertisement -
ప్రజల గళాన్ని ప్రభుత్వాల వరకు తీసుకెళ్లే ప్రధాన భూమిక జర్నలిస్టులదే
- విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్సార్సీపి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు
- చిన్న శ్రీనును మర్యాదపూర్వకంగా కలుసుకున్న స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల
- విశాఖపట్నం ; అసోసియేషన్ రూపొందించిన డైరీ అందజేత (విశాఖపట్నం – జనవరి 8 సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్సార్సీపి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)అన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజయనగరంలో గురువారం ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని అసోసియేషన్ రూపొందించిన డైరీని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలు, వారి సంక్షేమం, అలాగే ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఎస్సీఆర్డబ్ల్యూఏ పాత్రపై చర్చించారు.ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మీడియా ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభం అన్నారు.ప్రజల గళాన్ని ప్రభుత్వాల వరకు తీసుకెళ్లే ప్రధాన భూమిక జర్నలిస్టులదే అన్నారు.
“వైయస్సార్సీపి జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోరాడుతుందన్నారు.
నిజాయితీగా, భయపడకుండా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే జర్నలిస్టులకు తన పూర్తి మద్దతు ఉంటుందనీ అన్నారు.మీడియా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను అన్నారు. అనంతరం ఎస్సీఆర్డబ్ల్యుఏ ప్రతినిధులు ఆయనను దుస్సాలువాతో సత్కరించారు..ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్,ఉపాధ్యక్షులు ఎం.పి.రాజు,ఎల్.గణపతిరావు తో పాటుగా వైయస్సార్సీపీ విశాఖ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు వంకాయల మారుతి ప్రసాద్ పాల్గొన్నారు.


