Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆసుపత్రిలో రోగులకు భోజనపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ

ఆసుపత్రిలో రోగులకు భోజనపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; సేవా కార్యక్రమ రూపం అనేది భగవంతుని సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి- గాంధీ నగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 380 రోగులు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను ప్రభుత్వ వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నామా ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహాయ సహకారములతో నిర్వహించడం మాకెంతో తృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. నేటి ఈ సేవా కార్యక్రమానికి చిరంజీవి చింత నీలేశ్వర సాయి (కీర్తిశేషులు ఈశ్వరయ్య ముని మనవడు) దాతగా వ్యవహరించడం జరిగిందని, వీరికి సేవాసమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలను వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని, మా ఆసుపత్రి రోగులకు, సహాయకులకు, గర్భిణీ స్త్రీలకు ఒక వరంలాగా మారిందని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాతలు ఇటువంటి సేవా కార్యక్రమాలకు ముందంజలో ఉండాలని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి తరఫున సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తి కలవారు సెల్ నెంబర్ 9966047044 గాని 90304 44065కు గాని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు