Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమెగా డీఎస్సీ కాదు… దగా డీఎస్సీ

మెగా డీఎస్సీ కాదు… దగా డీఎస్సీ

- Advertisement -

రెండవ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు
విశాలాంధ్ర ధర్మవరం;;డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వైఎస్ఆర్సిపి నాయకుడు – రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయ ముందు బాగానే దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. అనంతరం వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదివి టెట్, డీఎస్సీ, బిఈడి పూర్తి చేసి, మెరిట్‌తో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలని కలలు కన్న వేలాది మంది నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది అని మండిపడ్డారు.ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించినా, చివరకు అది “దగా డీఎస్సీగా మారిందని మండిపడ్డారు.
అర్హత, మెరిట్ ఉన్న అభ్యర్థులను పక్కనబెట్టి, డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు రావడం వల్ల నిజాయితీగా పరీక్ష రాసిన అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన సమయంలో ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి కుటుంబం తమ పిల్లల భవిష్యత్తు కోసం చేసిన త్యాగాలను ప్రభుత్వం గౌరవించకుండా, అర్హత కంటే అవకతవకలకు ప్రాధాన్యం ఇచ్చిందనే భావన రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిందన్నారు. తదుపరి వైయస్సార్సీపి చేపట్టిన ప్రధాన డిమాండ్లను నెరవేర్చి ఎంతవరకు మా దీక్షలు ఆగవు అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో వైయస్సార్సీపి యువజన విభాగం నియోజకవర్గం అధ్యక్షులు గంగాధర్,పట్టణ అధ్యక్షులు వేణు,సోషల్ మీడియా నియోజకవర్గం అధ్యక్షులు చిరువర్ధన్ రెడ్డి,సోషల్ మీడియా పట్టణ అధ్యక్షులు జక్కా భార్గవ,సోషల్ మీడియా పట్టణ మాజీ కన్వినర్ రాజశేఖర్ రెడ్డి, చెన్నారెడ్డి,దివాకర్ నాయక్,దాసరి శివ,మహమ్మద్ రఫీ,సిద్దిక్,హరి, పట్టణ మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ మాసపల్లి సాయికుమార్,మాజీ కౌన్సిలర్లు రమాదేవి,యువజన విభాగం, నాయకులు చందాబాషా,అమిర్ బాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు