పి. హరి నాథ్ రెడ్డి
గూడూరు : పేదల పక్షాన నిలిచేది ఎర్ర జెండా అని , దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరి నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో సీపీఐ గూడూరు నియోజకవర్గం 2 వ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి సి.వి ఆర్ కుమార్, గుండాల రమేష్ లు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి లు పాల్గొన్నారు. ముందుగా గూడూరు సీపీఐ నియోజకవర్గ సమితి ఆద్వర్యంలో సీపీఐ కార్యాలయం నుండి టవర్ క్లాక్ మీదుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యునతే ధ్యేయం సీపీఐ లక్ష్యం అన్నారు.వంద ఏళ్లుగా సీపీఐ పార్టీ ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు, కర్షకులు, పేదల పట్ల నిలిచిందన్నారు. ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్ట్ లే అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరలు నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. గవర్నర్ ల వ్యవస్థతో ప్రజా స్వామాన్ని కునిచేస్తున్నారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల కు కొమ్ము కాస్తూ కార్మికుల హక్కులను కాలరస్తోందన్నారు. అందరూ సంఘటిత మై హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.


