Homeజిల్లాలుఅనంతపురంఅమరజీవి త్యాగం చిరస్మరణీయం : స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్

అమరజీవి త్యాగం చిరస్మరణీయం : స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్

- Advertisement -

​విశాలాంధ్ర – రాప్తాడు : ​తెలుగు వారి ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. 58 రోజుల పాటు సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ధన్యజీవి శ్రీరాములు అని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన చూపిన త్యాగనిరతి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పిలుపునిచ్చారు. జై ఆంధ్ర.. జై తెలుగు తల్లి” నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మారుమోగింది. కార్యక్రమంలో తహశీల్దార్ పి.విజయకుమారి, ఏఓ భానురేఖ, డిప్యూటీ ఎంపీడీఓ అశోక్, ఐసిడిఎస్ సూపర్వైజర్ లీలావతి, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు