Homeజిల్లాలుఅనంతపురంరాజకీయాలకు అతీతంగా మానవత్వం చాటిన టిడిపి ఎమ్మెల్యే

రాజకీయాలకు అతీతంగా మానవత్వం చాటిన టిడిపి ఎమ్మెల్యే

- Advertisement -

వైసీపీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి మానవత్వానికి పెద్దపీట వేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ను నియోజకవర్గ ప్రజలు అభినందిస్తున్నారు.. గత ఎన్నికల సమయంలో గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబానికే గురువారం అండగా నిలిచిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన మానవీయ కోణాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం గుద్దిళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వడ్డే రాము భార్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. గతాన్ని తలచుకోకుండా ముందుకు సాగిన ఆయన, కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. అంతేకాకుండా వడ్డే రాము కుమారుడు, కుమార్తె చదువు బాధ్యతను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ మానవీయ చర్యతో గ్రామస్థులే కాకుండా స్థానిక నాయకులు కూడా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మోరేపల్లి చౌలం మల్లికార్జున, డాక్టర్ లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి, జ్ఞానభారతి విద్యా సంస్థల అధినేత రమేష్ బాబు, మాజీ కన్వీనర్ దండా వెంకటేశులు, ఆవుల తిప్పేస్వామి, మాజీ సర్పంచులు గాజుల శ్రీరాములు, ములకనూరు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు