Homeజిల్లాలుఅనంతపురంజయనగర్ కాలనీలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం..

జయనగర్ కాలనీలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం..

- Advertisement -

ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి చొరవతో పైపులైన్ పనులు పూర్తి

విశాలాంధ్ర–తాడిపత్రి :ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి చొరవతో పట్టణంలోని జయనగర్ కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని 21వ వార్డు కౌన్సిలర్ టి. హుస్సేన్ భాష తెలిపారు. గురువారం పట్టణంలోని 21వ వార్డు జయనగర్ కాలనీలో చేపట్టిన త్రాగునీటి సరఫరా పైపులైన్ పనులను కౌన్సిలర్ టి.హుస్సేన్ భాష, మున్సిపల్ ఏఈ నాగేంద్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయనగర్ కాలనీ 18వ రోడ్డులో నివసిస్తున్న ప్రజలు చాలా కాలంగా త్రాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కాలనీలో పర్యటించిన సందర్భంగా ప్రజలు తమ సమస్యను ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ఆ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు జయనగర్ కాలనీ 18వ రోడ్డులో కొత్తగా త్రాగునీటి సరఫరా పైపులైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డిలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు