Homeజిల్లాలుఅనంతపురంవ్యవసాయ పరిశోధన కేంద్రం లో కార్మికుల కూలీ రేట్లు పెంచాలి

వ్యవసాయ పరిశోధన కేంద్రం లో కార్మికుల కూలీ రేట్లు పెంచాలి

- Advertisement -

విశాలాంధ్ర,కదిరి…పట్టణంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం లో పని చేసే దినసరి కార్మికుల కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి బి. కదిరప్ప అన్నారు. శుక్రవారం ఆయన వ్యవసాయ పరిశోధన శాఖ అధికారి భాస్కర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం ఆయన వ్యవసాయ కూలీల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జీవనోపాధి కోసం వలసలు వచ్చి చాలి చాలాని కూలీతో తీవ్ర ఇబ్బందులు పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.మార్కెట్ ధరలను దృష్టిలో ఉంచుకొని న్యాయమైన కూలి నిర్ణయించాలన్నారు.కూలీలకు శ్రమిస్తున్నందున పని భద్రతా చర్యలు,కనీస సౌకర్యాలు అందించాల న్నారు. వారి హక్కులు, గౌరవం కాపాడే విధానాలు అమలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఆదినారాయణ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బ్రహ్మయ్య,చరణ్,సుధాకర్ చెన్నకేశవులు,బాలకృష్ణ వెంకటరాముడు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు