శ్రీ సత్య సాయి సేవా సమితి..2 నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్యసాయి సేవా సమితి 2 టిఆర్టి సర్కిల్ సేవాదళ్ సభ్యులు సాంబశివుడు, ఆచారి జనార్ధన, సుబ్రహ్మణ్యం, అశోకు, కాకుమాని విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 250 మందికి ఉదయం పాలు బ్లడ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సేవాదాతగా బికే తులసమ్మ వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి వ్యక్తి మానవ సేవను అలవాటు చేసుకోవాలని, తనకున్న ధనములో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించినప్పుడే సార్థకము లభిస్తుందని, మానవతా విలువలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి చేస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమవుతాయని తెలుపుతూ వారికి ప్రభుత్వ ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు.
రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది..
- Advertisement -
RELATED ARTICLES


