విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని రాయలసీమ అభ్యుదయ విధ్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ కార్యాలయం నందు సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విధ్యార్థి సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖాజా, కృష్ణ మాట్లాడుతూ కంబదహాల్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. గ్రామంలో ఉన్న బోర్లలలో ఒక బోరు పూర్తిగా ఎండిపోయి నీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వేసవి ఆరంభంలోనే నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. గ్రామంలో ప్రైవేటు జనరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రజలు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారన్నారు. కావున అధికారులు స్పందించి తక్షణమే కొత్త బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.