నిందితుడి అరెస్టు – ల్యాప్‌టాప్, ట్యాబ్ స్వాధీనం. వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వన్ టౌన్ పోలీసులు శివా నగర్లో గల ఐదవ వార్డ్ సచివాలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును వేగవంతంగా ఛేదించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీమతి అంకిత సురాన
డీఎస్పీ నరసింగప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి కేసు విచారణ చేపట్టడం జరిగిందన్నారు. మే 24వ తేదీ రాత్రి ధర్మవరం పట్టణంలోని 5వ వార్డు సచివాలయంలోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి ఒక ల్యాప్‌టాప్, ఒక ట్యాబ్‌ను అపహరించడంతో పాటు కార్యాలయంలోని ఫైళ్లకు నిప్పంటించి ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది అని తెలిపారు.ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు , గూఢచారి సమాచారంతో దర్యాప్తు కొనసాగించి, పట్టణంలోనీఎర్రగుంట సర్కిల్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అన్నారు. నిందితుడు పట్టణములోని శివానగర్లో విద్యాసాగర్ రెడ్డి అనే 19 సంవత్సరాల వయసుగల యువకుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగిందన్నారు. అతని వద్ద నుండి సచివాలయానికి చెందిన ఒక ల్యాప్‌టాప్ , ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకుందామన్నారు.
నేరానికి దారితీసిన పరిస్థితులు
నిందితుడు కొంతకాలంగా జులాయిగా తిరుగుతూ చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది అని తెలిపారు. సచివాలయంలో డబ్బులు ఉంటాయని భావించి, సచివాలయం గేటు దూకి, అక్కడ ఉన్న ఐరన్ పైపు సహాయంతో తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు అని తెలిపారు.అనంతరం ల్యాప్‌టాప్, ట్యాబ్‌ను అపహరించి ఇంటికి తీసుకెళ్లాడు. తరువాత పోలీసులకు వేలిముద్రలు దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో, తన వాహనం నుండి పెట్రోల్ తీసుకుని రాత్రి సుమారు 2 గంటల సమయంలో మళ్లీ సచివాలయానికి వచ్చి, తాను తాకిన ప్రాంతాల్లో పెట్రోల్ చల్లి నిప్పంటించినట్లు విచారణలో వెల్లడైంది అని తెలిపారు.కేసు ఛేదనలో పుట్టపర్తి సబ్ డివిజన్ డీఎస్పీ, ధర్మవరం టౌన్ సీఐ, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిందితుడిని అరెస్టు చేసామన్నారు.
పట్టణంలోని వార్డు సచివాలయంలో చోరీ కేసు ఛేదన
- Advertisement -
RELATED ARTICLES


