Homeజిల్లాలువిజయనగరంవైసీపీ హయాంలో రసాయనాలతో తిరుమల లడ్డూ తయారీ

వైసీపీ హయాంలో రసాయనాలతో తిరుమల లడ్డూ తయారీ

- Advertisement -

– జనసేన ఇన్ఛార్జ్ పొగిరి సురేశ్ బాబు సంచలన ఆరోపణలు

విశాలాంధ్ర -రాజాం (విజయనగరం జిల్లా) : వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు, రసాయనాలు వినియోగించి మహాపరాధం చేశారని రాజాం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్, జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పొగిరి సురేశ్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం రాజాంలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కోట్లాది హిందువుల విశ్వాసాలకు ప్రతీక అయిన తిరుమల లడ్డూను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం కలుషితం చేసిందని విమర్శించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై వచ్చిన సిట్ నివేదికలోని కీలక అంశాలను వైసీపీ నేతలు కావాలనే కప్పిపుచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిట్ నివేదికలో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ బాధ్యత వహించాల్సిన వారు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుమానాలు తలెత్తడం ప్రతి హిందువు హృదయాన్ని కలిచివేసే అంశమని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు