Wednesday, January 22, 2025
Homeఅంతర్జాతీయంనేడు అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం .. భారత్ ప్రతినిధిగా జయశంకర్

నేడు అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం .. భారత్ ప్రతినిధిగా జయశంకర్

కేపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్‌లో ప్రమాణ స్వీకార వేదిక
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు (20వ తేదీ మధ్యాహ్న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటికే దేశ రాజధాని వాషింగ్టన్‌కు దేశ, విదేశీ ప్రతినిధులు చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీలో ప్రస్తుతం మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా కేపిటల్ హిల్ లోని రోటుండా ఇండోర్‌లో నిర్వహించనున్నారు. అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత ప్రతినిధిగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హజరువుతున్నారు. ఇప్పటికే ఆయన వాషింగ్టన్ చేరుకున్నారు. మరో పక్క భారత వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ దంపతులు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నారు. కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ తొలి రోజే వందకుపైగా కీలక ఆదేశాలపై సంతకాలు చేస్తారు. అమెరికాలో సౌత్ సరిహద్దులు బంద్ చేయడంతో పాటు అక్రమ వలసదారులను వెనక్కి పంపడం లాంటి చాలా అంశాలపై సంతకం చేయనున్నారు. యూఎస్ సైన్యంలో ట్రాన్స్ జెండర్లను నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారిగా 15 వేల మంది ఉద్యోగం కోల్పోయే ప్రమాదం నెలకొందని భావిస్తున్నారు. పలు దేశాలపై అదనపు పన్నుల విధింపుపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు