Homeజిల్లాలుఅనంతపురంఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా విజయభాస్కర్

ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా విజయభాస్కర్

- Advertisement -

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా ఉరవకొండ మండలం షేక్షానుపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నరిశేటి విజయభాస్కర్ నియమితుల య్యారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిసివో స్పెషల్ చీఫ్ సె క్రెటరీ బి. రాజశేఖర్ నూతన కమిటీను అధికారికంగా ప్రకటించారు. కమిటీకు గౌరవాధ్యక్షులుగా ఎమ్మెల్యే (మంత్రి) పయ్యావుల కేశవ్ కొనసాగనున్నారు. వైస్ ఛైర్మెన్ శింగనమల నజీర్, సభ్యులుగా కురుబ పరమేషప్ప, గాజుల నరసమ్మ, అమిలినేని లక్ష్మి, బందినకల్లు సుజాత, యాదవ జవాజి శివప్ప, బరే పద్మావతి, ఇ.శకుంతలమ్మ, జె.సులోచనమ్మ, సుగాలి రామాంజినాయక్, అచనాల చెన్నకేశవ, జి. రామాంజినేయులు, కె. రాజేశ్వరి, మీనుగ వర ప్రసాద్లు నియమితులయ్యారు. వీరితోపాటు విడపనకల్లు పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్, వ్యవసాయశాఖ ఉరవకొండ సహాయ సంచాలకులు, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, జిల్లా అగ్రి ట్రేడ్, మార్కెటింగ్ ఆఫీసర్ సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ విజయభాస్కర్ మాట్లాడుతూ ఉరవకొండ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తను తన వంతు కృషి చేస్తానన్నారు. తనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రావడానికి కృషి చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు