వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా చేశారు. శనివారం ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు ఎంపీ. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు నిన్న ప్రకటించిన విజయసాయి ఈరోజు ఢిల్లీలోని రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. రాజ్యసభకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే…
రాజీనామా అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతికి తన రాజీనామాను సమర్పించినట్లు తెలిపారు. రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారన్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామానే కాకుండా రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిందన్నారు. జగన్‌మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని.. ప్రజాదరణ జగన్‌కు తగ్గదని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నానని.. జగన్‌తో ఫోన్‌లో మాట్లాడి అన్ని వివరాలు చెప్పానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదని తెలిపారు.
వెళ్లిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను… నేను ఏ పార్టీలో చేరడం లేదు.. హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా ,వేంకటేశ్వర స్వామిని నమ్మిన వ్యక్తిగా నేనెప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. వైఎస్ కుటుంబంతో సున్నిహిత సంబంధాలు ఉన్నాయి . జగన్ అక్రమ కేసులో నన్ను అప్రూవర్ మారాలని ఎంతో మంది ఒత్తిడి తెచ్చారు. నేను అబద్ధాలు చెప్పను. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో నాపై కేసు పెట్టారు. కేవీ రావు నాకు ఎలాంటి సంబంధాలు లేవు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆయన వారి పిల్లల సాక్షిగా చెప్పాలి. నేను నా పిల్లలపై ప్రమాణం చేసి చెప్తాను. సీఐడీ నన్ను విచారణకు రావాలని చెప్పలేదు. నాపై లుక్ అవుట్ నోటీస్ ఇచ్చారు్ణ్ణ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.