Thursday, January 15, 2026
Homeఆంధ్రప్రదేశ్వ్యవసాయ కార్మికులపై మోడీ ప్రభుత్వం కుట్ర ,ఈనెల 14న బోగిలో మంటల్లో కొత్త పథకం ప్రతులు...

వ్యవసాయ కార్మికులపై మోడీ ప్రభుత్వం కుట్ర ,ఈనెల 14న బోగిలో మంటల్లో కొత్త పథకం ప్రతులు దగ్ధం చేయాలి

- Advertisement -


విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : వ్యవసాయ కార్మికులపై కుట్రతోనే ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంను రద్దు చేసిందని, ఈ పథకంను ఎందుకు ఎత్తి వేస్తున్నారో కేంద్రప్రభుత్వం ప్రజలకు సమాదానం చెప్పాలని , భూమిని కార్పొరేట్‌లకు అప్పగించేందుకే ప్రభుత్వం పథకంను రద్దుచేస్తుందని సదస్సులో వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈనెల 14న బోగి మంటల్లో నూతన పథకం ప్రతులను దగ్ధం చేయాలని, 30 గాంధీ జయంతి రోజులు పథకంలో మహాత్మగాంధీ పేరును తొలగించినందుకు నిరసనగా మండలాల్లో గాంధీ విగ్రహాల వద్ద సామూహిక నిరాహారదీక్షలు చేపట్టాలని తీర్మాణం చేశారు.శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ భవన్‌లో సీపీఐ శతజయంతి ఉత్సవాలు పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మికసంఘం ఆద్వర్యంలో మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టంను రద్దుచేయరాదని డిమాండ్‌ చేస్తూ ఆసంఘం రాష్ట్ర అద్యక్షులు సీహెచ్‌ కోటేశ్వరరావు ఆధ్యక్షతన రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు.ముందుగా సమావేశం హాలు వద్ద ఏర్పాటు చేసిన బీకేఎంయూ పథకాన్ని వ్యవసాయకార్మికసంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు పీ భీమలింగప్ప ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ఈ సదస్సులో ప్రదాన వక్త రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి , సీడబ్ల్యూసీ సభ్యులు కొప్పుల రాజు సదస్సునుద్దేశించి మాట్లాడుతూ యూపీఏ1 ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడో వామపక్షపార్టీలు ప్రతిపాధనతో అప్పటి కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనాయకులు చర్చించి ఈ అద్భుతమైన పథకంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తాను కర్నూలు కలెక్టర్‌గా ఉన్న సమయంలో జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఎప్పుడు ప్రజలు కరువుతో వలసలు పోయి ఇబ్బందులు పడేవారని అప్పుడు తాను అక్కడి ప్రజల ఇబ్బందులు చూసి బాధపడేవాడినన్నారు. ఈపథకం వలన వలసలు నివారించే అవకాశం వచ్చిందన్నారు. నేడు దేశంలో రెండు రకాల భావాజలాలు కనిపిస్తున్నాయన్నారు. రాజ్యాంగను అమలు చేస్తూ అందరికి ఓటు హక్కు ఉండాలని, దేశసంపద అందరూ సమానంగా పంచుకోవాలని, రాజ్యాంగాన్ని నమ్ముకుని దానిని మార్గదర్శకంగా పనిచేసే కాంగ్రెస్‌ ఒకవైపు, మరో వైపు మనువాద సిద్దాంతంతో అందరికి ఓటుహక్కు ఉండకుడదు, సంపద కొంతమందికే పంచాలని, అందరికి పంచకుడదని, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతంతో భావాజలంతో బీజేపీ 11 సంవత్సరాలుగా మానువాద సిద్దాంకు కట్టుబడి ఉన్నట్లు పలుమార్లు అర్థం అవుతుందన్నారు. ఈ ఫథకంను ఎందుకు ఎత్తివేస్తున్నారో కేంద్రప్రభుత్వం సమాదానం చెప్పాలన్నార
సుదీర్ఘపోరాట ఫలితమే ఈ చట్టం : మాజీ ఎమ్మెల్సీ జల్లివిల్సన్‌
వామపక్షపార్టీలు, వ్యవసాయకార్మికసంఘాల సుదీర్ఘపోరాట ఫలితంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం యూపీఏ 1 తీసుకుని వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ, ఏపీ వ్యవసాయకార్మికసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు జల్లివిల్సన్‌ అన్నారు. పనైనా చూపండితిండైనా పెట్టండనే నినాదంలో చేసిన పోరాటమే చట్టం అన్నారు. నాడు ఈచట్టంను తీసువచ్చినపుడు కూడా బీజేపీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. ఈచట్టం వలన వలసలు నివారించడమే కాకుండా 100 రోజులు పని హక్కు కలుగుతుందన్నారు. గ్రామాల్లో ఎంతో మంది పేదవారికి ఈ చట్టం ఉపయోగపడిరదన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య , ఆసంఘం జాతీయ సమితి సభ్యులు కేశవరెడ్డి , జిల్లా కార్యదర్శి నభిరసూల్‌ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్‌ మునెప్ప, ఎన్‌ లెనిన్‌బాబు, వ్యవసాయ కార్మికసంఘం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీ భీమలింగప్ప, జిల్లా అద్యక్షులు క్రిష్ణ, సీపీఐ నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి, డిసిసి అద్యక్షులు క్రాంతినాయుడు ,గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రామాంజనేయులు, సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు, సుబ్రమణ్యం, నారాయణమ్మ,,సీ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.ఈ సదస్సులో వివిధ జిల్లాల నుండి వచ్చిన వ్యవసాయకార్మికసంఘం సభ్యులు, సీపీఐ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు