విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విద్యుత్ చార్జీల తగ్గింపు కోసం బషీర్ బాగ్ కాల్పుల్లో అమరవీరుల ఆశయ సాధనకు పోరాడుతామని సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సహాయ కార్యదర్శి చంద్ర, రైతు సంఘం నాయకులు పరమేష్, సిఐటియు మండల కార్యదర్శి ఈరన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో బషీర్ బాగ్ కాల్పుల్లో అమరవీరుల 25వ వర్ధంతి సందర్భంగా ఏఐటియుసి, సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యమ అమరవీరుల ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులు కామ్రేడ్ రామకృష్ణ, విష్ణు వర్ధన్ రెడ్డి, బాలస్వామిలకు జోహార్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ, ఆదాని గ్రూపులకు అనుకూలంగా సంస్కరణలు విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు, ట్రూప్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి హనుమంతు, దస్తగిరి, ఉసేని, ఈరన్న, ఆల్లాబకాష్, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.


