Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రామ పంచాయతీలలో నీటి సమస్య లేకుండా గట్టిచర్యలు చేపడతాము

గ్రామ పంచాయతీలలో నీటి సమస్య లేకుండా గట్టిచర్యలు చేపడతాము

- Advertisement -

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని అన్ని గ్రామాలలో నీటి సమస్య లేకుండా గట్టి చర్యలు చేపడతామని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో క్రాష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రాస్ కార్యక్రమం 2026 లో అన్ని గ్రామాలలో వేసవి కాలమును దృష్టిలో ఉంచుకొని చేతి పంపులు మరమ్మత్తుల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. దీంతో వేసవి నెలల్లో నిరంతరాయంగా తాగునీటి సరఫరాను అందిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో సంబంధిత సిబ్బంది ద్వారా పనిచేయని చేతిపంపులను గుర్తించి ,తక్షణమే మరమ్మత్తు కోసం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రోజువారి పర్యవేక్షణ పురోగితిని ట్రాక్ చేస్తుందని, పంచాయితీ కార్యదర్శుల క్షేత్ర సిబ్బందితో కలిసి ,స్థానిక సంఘములతో సమన్వయం చేసుకొని, సమర్థవంతమైన అమలను చేపడతామని తెలిపారు. మండల పరిధిలోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి ఈ కార్యక్రమం ప్రాధాన్యత చోటు చేసుకున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ,డిప్యూటీ ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సి వి ఏపి బృందం, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు