తులాభారం

- Advertisement -

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి బాలదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా 3 తులభార కార్యక్రమాలు జరిగాయి దేవరపల్లి గ్రామానికి చెందిన ముదునూరి శివరాజు నాగలక్ష్మి దంపతుల కుమారుడు దుర్గాప్రసాద్ రాజుకు పట్టిక బెల్లంతో తులాభారం నిర్వహించారు ఇదే విధంగా ముదునూరు దుర్గాప్రసాద్ రాజు శ్రావణి దంపతుల కుశాల్ కుమార్ వర్మ కు బెల్లం తోను మరియొక కుమారుని మోచిత్ కుమార్ వర్మకు పటిక బెల్లంతో తులాభారం నిర్వహించారు అంతకుముందు బాలదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పైడికొండల సత్యనారాయణ కోశాధికారి కామిశెట్టి దుర్గారావు కమిటీ సభ్యులు గారపాటి అప్పారావు పైడికొండల శివయ్య పైడికొండల వెంకటేశ్వరరావు పెన్నమనే వెంకటకృష్ణ జాజిమొగ్గల ప్రభాకరరావు కామిశెట్టి ధర్మరాజు కామిశెట్టి మంగ మాత సీత స్థానిక భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు