అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న ‘ఏఏ23’ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ థీమ్ మ్యూజిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ రీల్స్ మార్కును దాటి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం జూన్ 2026 తర్వాత పట్టాలెక్కనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అట్లీ, లోకేష్ కనగరాజ్ ఇద్దరూ తమిళ డైరెక్టర్లే. అట్లీ మూవీ కూడా వరల్డ్‌వైడ్‌గా మంచి బిజినెస్ చేసినట్లు సమాచారం. లోకేష్ కనగరాజ్ ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కూలీ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు నష్టాలు రాకపోయినప్పటికీ… ఊహించినంత గొప్పగా హిట్ కాలేదు. కాకపోతే ఇందులో నటించిన రజనీకాంత్, నాగార్జున అక్కినేని తదితరులకు మాత్రమే మంచి యాక్టింగ్ స్కోరు లభించింది. ముఖ్యంగా నాగార్జునకు మూవీ విడుదలకు ముందు కనీసం రెండు నెలలపాటు ట్రెండింగ్ స్టార్‌గా గుర్తింపు లభించింది. అంతకుముందెన్నడూ ఏ హీరోకీ ఇలాంటి గుర్తింపు దక్కలేదు. పైగా తమిళనాడులో ఒక విలన్ క్యారెక్టర్‌కు అనూహ్యమైన ఫాలోయింగ్ రావడం ఇదే ప్రథమం. లోకేష్ అతిగా ఆలోచించినందునే ఈ సినిమా పెద్దగా హిట్కాలేదని విమర్శలున్నాయి. ఆమీర్‌ఖాన్ క్యారెక్టర్ అవసరం లేకపోయినా, అక్కడ ఆ క్యారెక్టర్‌ను సృష్టించి పెద్ద తప్ప్పు చేశారు. ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్‌తో తీయబోయే సినిమా మాత్రం పక్కా ప్లాన్‌తో నడిపిస్తున్నట్లు తెలిసింది.


