లక్నో: భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ లిమిటెడ్, ఉత్తరప్రదేశ్‌లో ఏడున్నర దశాబ్దాలకు పైగా తన ఉనికిని, పారిశ్రామిక శ్రేష్ఠత, ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, నిరంతర జీవనోపాధి కల్పనకు తన సహకారాన్ని గుర్తుచేసుకుంటూ, తాజాగా తన లక్నో ప్లాంట్ నుండి 10వ లక్ష వాణిజ్య వాహనాన్ని విడుదల చేసి ఒక కీలకమైన మైలురాయిని చేరుకుంది. భారతదేశ వాణిజ్య వాహన పరిశ్రమ పరిశుభ్రమైన, స్మార్ట, మరింత సమర్థవంతమైన మొబిలిటీ పరిష్కారాల వైపు వేగంగా రూపాంతరం చెందుతున్న తరుణంలో, ఈ మైలురాయి భవిష్యత్ మొబిలిటీని తీర్చిదిద్దడంలో టాటా మోటార్స్ నాయకత్వాన్ని నొక్కి చెబుతుంది. సున్నా ఉద్గారాలు వెలువరించే ఈ bలకిక్ బస్సు అనే మైలురాయి వాహనం, రాష్ట్ర రాష్ట్రపు ‘నెట్‌జీరో 2070’ దార్శనికతకు, కంపెనీ 2045 నాటి నెట్‌జీరో లక్ష్యానికి అనుగుణంగా, హరిత రవాణా పట్ల ఉత్తర ప్రదేశ్ మరియు టాటా మోటార్స్ యొక్క ఉమ్మడి నిబద్ధతను చాటింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, టాటా సన్స్ లిమిటెడ్ ఛైర్మన్ bన్. చంద్రశేఖరన్ దీనిని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్‌తో పాటు, టాటా మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ bగ్జిక్యూటివ్ ఆఫీసర్ గిరీష్ వాఘ్, నాయకులు పాల్గొన్నారు.
టాటా మోటార్స్ లక్నో ప్లాంట్‌లో 10 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి మైలురాయి
- Advertisement -


