Homeవ్యాపారంతెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపిన అమెజాన్

తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపిన అమెజాన్

- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రణాళికలో (కరికులం) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యా నైపుణ్యాలను చేర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖతో చేతులు కలిపినట్లు అమెజాన్ ఈరోజు ప్రకటించింది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఏ ఎఫ్ ఈ) ప్రోగ్రామ్ ద్వారా సాగన్ను ఈ చొరవతో ప్రతి సంవత్సరం 10 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. దీనితో పాఠశాల స్థాయిలోనే ఇంత పెద్ద ఎత్తున ఏఐ విద్యను కరికులంలో చేర్చిన దేశంలోని మొదటి రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ నిలిచింది. ఎస్సీఈఆర్టీ తెలంగాణ రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ టెక్స్ట్బుక్ ద్వారా 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ ఏఐ (ఏఐ) విద్యా నైపుణ్యాలను పరిచయం చేస్తుంది. దీనికి స్వచ్ఛంద సంస్థ ‘పై జామ్ ఫౌండేషన్’ కంటెంట్, ఇంప్లిమెంటేషన్ పరంగా మద్దతు అందిస్తుండగా, వారి ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్ ‘కోడ్మిత్ర’ ద్వారా ప్రాకిట్కల్ శిక్షణను అందిస్తారు. పాఠ్యప్రణాళిక అనుసంధానం, ప్రాకిట్కల్ లెర్నింగ్, కెరీర్ అవగాహన, ఉపాధ్యాయుల శిక్షణ ద్వారా 2030 నాటికి వెనుకబడిన వర్గాలకు చెందిన 40 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ విద్యను, కెరీర్ అవేర్నెస్‌ను అందించాలనే అమెజాన్ నిబద్ధతలో భాగమే ఈ చొరవ. భారత ప్రభుత్వ జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) 2020కి అనుగుణంగా సాగుతున్న ఈ కార్యక్రమం, ముఖ్యంగా వసతులు లేని ప్రాంతాల విద్యార్థులను భవిష్యత్తు ఉద్యోగాలకు మరియు సాంకేతికతలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా మాట్లాడుతూ.. “అమెజాన్తో మా భాగస్వామ్యం ద్వారా ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కేవలం సాంకేతికతను ఉపయోగించడమే కాకుండా, అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని, వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి దానిని అప్లై చేసేలా చేయడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు