అమెరికాపై 9/11 తరహా దాడులు చేస్తామని హెచ్చరికలు
తెహ్రాన్: తమపై దాడులు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తోందని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులు, ప్రకటనలతో ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చాయి. కయ్యానికి కాలుదువ్వుతూ అమెరికా ఇరాన్‌ను రెచ్చగొడుతోంది. హోర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇకనుంచి ఏదైనా నౌకపై దాడి చేసినపðడల్లా ఆ దేశంలోని ఓ వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. దానికి ఐఆర్జీసీ నుంచి తీవ్ర స్పందన వచ్చింది. అమెరికాపై 9/11 తరహా దాడి చేస్తామని బెదిరించింది. ఘర్షణలు ఇలాగే కొనసాగితే ఆ దేశం జాతీయ సంతాప దినాలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ తస్నిమ్ పేర్కొంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి (2001) అమెరికా చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోయింది. సెప్టెంబరు 11, 2001న 4 విమానాలను అల్ఖెదా ఉగ్రవాదులు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. 19 మంది ఉగ్రవాదులు నాలుగు జట్లుగా విడిపోయి ‘ట్విన్ టవర్స్’గా పిలుచుకునే ప్రపంచ వాణిజ్య సంస్థ భవంతులపై దాడులకు పాల్పడ్డారు. ఈ మారణహోమంలో 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది పౌరులు క్షతగాత్రులయ్యారు. అప్పుడు అమెరికా జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. అటువంటి ఘటనలను ఇప్పుడు ఇరాన్ గుర్తు చేసింది అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమ సార్వభౌమత్వంపై ఎవరి పెత్తనాన్ని సహించబోమని మరొక్కసారి స్పష్టం చేసింది.
దాడులు కొనసాగితే తీవ్ర పరిణామాలు: ఇరాన్
- Advertisement -
RELATED ARTICLES


