టీపీసీసీ లీగల్ సెల్ ` సీజేఐపై దాడికి నిరసన
విశాలాంధ్ర-హైదరాబాద్: సీజేఐ బీఆర్ గవాయ్ పై జరిగిన దాడిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) లీగల్ సెల్ తీవ్రంగా ఖండిరచింది. చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ హైకోర్టు గేట్ నెం.6 వద్ద మంగళవారం నిరసన తెలిపింది. పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై దాడి చేయడమంటే ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి చేసినట్లేనన్నారు. న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని, సమగ్రతను కాపాడే దిశగా న్యాయవాదులు, ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా న్యాయపరమైన విలువలు, రాజ్యాంగ పరిరక్షణపై నిబద్ధతను న్యాయవాదులు, టీపీసీసీ లీగల్ సెల్ సభ్యులు పునరుద్ఘాటించారు. మొమిన్ రోషన్ జమీర్, కురుమ నరేందర్, అభిలాష్ ఆశ్రిత్, కమలాకర్, రాజేంద్ర ప్రసాద్, ముజక్కిర్, హైదర్, బాలాజీ, రాజ్‌కుమార్, ఇనాయతుల్లా, లుక్మాన్ అలీ, శిబా రాణి, సంతోష్, మహేష్, శారద, ప్రభాకర్, సిలం, రాఘవేంద్ర రెడ్డి, నర్సింగ్, హరిందర్ సింగ్, ఇతర అభిమత సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


