లిమా: పెరూలో హింస పేట్రేగింది. దీంతో నూతన అధ్యక్షుడు జోసె జెరి 30 రోజుల ఎమర్జెన్సీ ప్రకటించారు. హింసను కట్టడి చేయలేదన్న కారణంగా గత ప్రభుత్వాన్ని జెన్ జీ ఆందోళనలు కూల్చివేయడం విదితమే. కొత్తగా బాధ్యతల్లోకి వచ్చిన జోసె జెరి ఈ పరిస్థితిని అదుపు చేయడంపై దృష్టిని సారించారు.
హింసను ఆపేందుకు కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో రాజధాని లిమాలో జనం గుమ్మిగూడకుండా నిషేదాజ్ఞలు జారీ చేశారు. నెల రోజుల పాటు అత్యవసర పరిస్థితి అమలు చేస్తూ టీవీ మాధ్యమంగా ప్రకటన వెలువరించారు. లిమాలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు 1,690 హత్యలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో 1,502 హత్యలు జరిగాయి. హత్యలు, దొంగతనాలు వంటివి బాగా పెరిగి… వాటిని కట్టిడి చేయలేని పరిస్థితుల్లో తీవ్ర నిరసనలను ఎదుర్కొన్న మాజీ అధ్యక్షులు దీనా బలౌర్టే అభిశంసనకు గురయ్యారు. చివరకు పదవిని కోల్పోయారు. కొత్త అధ్యక్షుడి రాజీనామాను కోరుతూ ఇటీవల జెన్ జీ ఆందోళనలు జరిగాయి. కానీ జోసె జెరి ససేమిరా అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. హింసను కట్టడి చేస్తానని హామీనిచ్చారు. నేరస్తుల ఆట కట్టించేందుకు పోలీసులకు మద్దతుగా సైన్యాన్ని రంగంలోకి దించనున్నారు. కొన్ని హక్కులనూ పరిమితం చేయాలని యోచిస్తున్నారు. ఇదే క్రమంలో 30 రోజుల అత్యవసర పరిస్థితిని తాజాగా ప్రకటించారు. ‘యుద్ధాలను గెలవాలంటే మాటలు కాదు చేతలు అవసరం’ అని అన్నారు.
పెరూలో 30 రోజుల ఎమర్జెన్సీ
- Advertisement -
RELATED ARTICLES


